జ‌గ‌న్ స‌ర్కార్ పై ఆర్ఆర్ఆర్ నిర్మాత సీరియ‌స్‌..మాకు వ‌ర్కౌట్ కాదు !

-

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి కే ఈ సినిమా నుంచి విడుద‌ల అయిన‌.. పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను భారీ గా పెంచేశాయి. ఈ నేప‌థ్యంతోనే.. ఇవాళ ఈ సినిమా చిత్ర బృందం… ప్రెస్ మీట్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా.. ఏపీ స‌ర్కార్ నిర్న‌యం తీసుకున్న ఆన్ లైన్ విధానం, టికెట్ల ధ‌ర‌ల‌పై కూడా చ‌ర్చ వ‌చ్చింది.

ఓ విలేక‌రి.. టికెట్ల ధ‌ర‌ల‌పై ఆర్ ఆర్ ఆర్ మూవీ నిర్మాత ధాన‌య్య‌ను ఆడిగారు. ఈ సంద‌ర్భంగా.. జ‌గ‌న్ స‌ర్కార్ పై దాన‌య్య కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆంధ్రాలో టికెట్ల రేట్లు త‌గ్గించారు, ఆ నిర్ణ‌యం పెద్ద సినిమాల‌కు వేటికి వ‌ర్కౌట్ కాదు… అయితే.. మేము ఇంకా ఏపీ ప్ర‌భుత్వంతో ఈ సమ‌స్య గురించి సంప్ర‌దించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాము. జ‌గ‌న్ స‌ర్కార్ టికెట్ రేట్ల పై సానుకూలంగా స్పందిస్తుంద‌ని.. ఎదురు చూస్తున్నాము. లేక‌పోతే.. మాకు చాలా న‌ష్టాలు వ‌స్తాయి. అంటూ ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version