రాప్తాడు అధికార వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని హత్య కు కుట్ర జరుగుతోందని… జగన్ ను హత్య చేసైనా అధికారంలోకి రావాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ గాల్లో కలిసిపోతారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారని…సీఎంను జైలుకు పంపాలని టీడీపీ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొడాలి నానిఎమ్మెల్యేలు వంశీ, అంబటి లను చంపితే 50 లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు చెబుతున్నారని.. ఇదే టీడీపీ విధానమా? హింసా రాజకీయాలకు కేరాఫ్ టీడీపీ అని మండిపడ్డారు. స్కాంలకు కేరాఫ్ చంద్రబాబు అని.. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో 242 కోట్లను షెల్ కంపెనీలకు దారాదత్తం చేశారనిన నిప్పులు చెరిగారు. సీఐడీ విచారణకు టీడీపీ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారని.. చంద్రబాబు పాలనలో వేల కోట్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఫైర్ అయ్యారు..