మీ భాగస్వామితో బంధం సరిగ్గానే ఉందా..? ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్ బెల్స్ మోగినట్టే..

-

జీవిత భాగస్వాములు పరస్పరం నమ్మకంగా ఉండాలి. అవతలి వారి జీవితంలో మీరు భాగం అవుతున్నారంటే.. వారి జీవితానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రెస్పెక్ట్ విషయంలో తేడా జరిగితే ఆ బంధంలో బీటలు వస్తాయి.

ప్రస్తుతం జీవిత భాగస్వాముల బంధంలో బీటలు రావడానికి కారణం అయ్యే కొన్ని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

కంట్రోల్:

బంధంలో ఉన్న వారిని ప్రతి విషయంలో కంట్రోల్ చేయడం మంచిది కాదు. వాళ్ళ నిర్ణయం ఏంటో అడగకుండా సొంతంగా నిర్ణయం తీసేసుకోవడం.. బంధం లో ఉన్న వారిని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. దీనివల్ల మీ మీద కోపం కలుగుతుంది.

ప్రతిదానికి తిట్టడం , హేళన చేయడం:

చిన్న చిన్న విషయాలకు భాగస్వామిని హేళన చేయటం తగదు. అవతలి వాళ్ళ ముందు మీరు మీ భాగస్వామిని హేళన చేస్తే మీ బంధానికి డేంజర్ బెల్స్ మోగినట్టే. అంతేకాకుండా నలుగురిలో ఉన్నప్పుడు మీ భాగస్వామి హర్ట్ అయ్యేలా తిట్టడం కూడా కరెక్ట్ కాదు.

విమర్శలు:

అదే పనిగా భాగస్వామి చేసే ప్రతీ చర్య మీద విమర్శ చేయడం బంధానికి బీటలు వారేలా చేస్తుంది. సద్విమర్శ ఎప్పుడూ మంచిదే. కానీ చులకన చేసినట్టుగా మాట్లాడి వాళ్ళ పని మీద విమర్శ చేయడం వల్ల అవతలి వారిలో మీ మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది.

కొత్తగా పెళ్లి చేసుకునే వారు మీ భాగస్వామి పట్ల పైన పేర్కొన్నట్లుగా బిహేవ్ చేయకుండా ఉండడమే మంచిది. అవతలి వాళ్ళు మీ పట్ల పై విధంగా బిహేవ్ చేస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version