డార్క్ చాక్లెట్ తో ఐరన్ లోపాన్ని భర్తీ చేయొచ్చు..ఇంకా ఇవి కూడా..!

-

బాడీలో ఐరన్ లోపిస్తే.. రక్తహీనత సమస్య ఎదుర్కోక తప్పదు. మగవారితో పోలిస్తే… ఐరన్ లోపం ఎక్కువగా స్త్రీలల్లోనే ఉంటుందట. ప్రతి ఇద్దరు మహిళల్లో.. ఒకరు ఐరన్ లోపంతో బాధపడుతున్నట్లు..సర్వేలు చెప్తున్నాయి. ప్రొటీన్, ఐరన్ లోపం అనేది.. మన దేశంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య. ఇక బాడీలో ఏది లోపిస్తే.. దానికి తగ్గట్టు ట్యాబ్లెట్ వేస్తే సెట్ అనుకుంటారు కొందరు. కానీ ఎన్నాళ్లని అలా వేస్తారు. అవసరానికి మించి ట్యాబ్లెట్ వాడకం కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తినే ఆహారంలో పోషకాలు అన్నీ ఉండేలా చూసుకుంటే.. అసలు ఏ లొల్లి ఉండదు.. మీకు ఎంతో ఇష్టమైన.. డార్క్ చాక్లెట్ ద్వారా కూడా ఐరన్ లోపాన్ని భర్తిచేయొచ్చు తెలుసా..? ఇంకా చాలా ఉన్నాయి.. అవేంటో చూద్దామా..!

నువ్వులు

నువ్వులు అనగానే మీ అందరికి ఇది తేడి వేడిచేస్తుంది అనే డౌట్ రావొచ్చు. నిజానికి నువ్వులు తింటే వేడి చేయదు. అది మీ అపోహ మాత్రమే.. నువ్వులు తిన్నప్పుడు బాడీ ఎక్కువ వాటర్ ను కన్సూమ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు మీరు వాటర్ ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. కానీ మనం అలా చేయం. దీంతో బాడీకీ సరిపడా వాటర్ అందక వేడిచేస్తుంది. మీరు డైలీ నువ్వల ఉండ తిని.. 4-5 లీటర్లు నీళ్లు తాగండి.. వేడి చేయదు. నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఐరన్, కాల్షియం లోపాన్ని భర్తే చేయడమే కాకుండా.. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వంద గ్రాముల నువ్వుల్లో ఏకంగా 14.6 శాతం ఐరన్ ఉంటుందట. అంటే రోజూ తీసుకోవాల్సిన ఐరన్‌లో దాదాపు ఎనభై శాతం అన్నమాట.

కిస్‌మిస్

ఐరన్ లోపం ఉంటే.. తోటకూర, పాలకూర తినమని చాలామంది చెప్తుంటారు. కానీ మనకు అవి నచ్చవుగా.. అవి నచ్చకపోతే.. కిస్ మిస్ తినేయండి.. టేస్టిగా కూడా ఐరన్ లోపాన్ని క్లియర్ చేసేయొచ్చుగా.. వంద గ్రాముల కిస్‌మిస్‌లో 1.9 మిల్లీ గ్రాములు ఐరన్ లభిస్తుంది. ఇది రోజూ కావాల్సిన దానిలో పదిశాతం.. ఇటు రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఐరన్‌తో పాటు మరెన్నో పోషకాలు ఉండడం వీటి ప్రత్యేకత. స్వీట్ తినాలనిపించినప్పుడల్లా నాలుగైదు కిస్‌మిస్‌లను నోట్లో వేసుకుంటే తీపి తినాలన్న కోరిక కూడా ఉండదు.

డార్క్ చాక్లెట్

ఇది ఇంకా హైలెట్.. చాక్లెట్ తినడం అంటే మనలో చాలామందికి ఇష్టం. అయితే వంద గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 8 ఎంజీ ఐరన్ ఉంటుందట. ఇది మనం రోజూ తీసుకోవాల్సిన మొత్తంలో నలభై ఐదు శాతానికి పైనే ఉంటుంది.. ఇందులో కేవలం ఐరన్ మాత్రమే కాదండోయ్…. మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఇంకెన్నో పోషకాలు ఉన్నాయి.. అయితే ఎంత మంచిదైనా డార్క్ చాక్లెట్‌ని రోజూ ఓ చిన్న ముక్క కంటే ఎక్కువగా తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు.

ఎండు ఫలాలు..

ఎండిన టొమాటోలు, అల్‌బుకారా, పీచ్, ప్రూన్స్, ఆప్రికాట్స్.. ఇలా ఎండిన ఫలాలన్నింటినీ తీసుకోవడం వల్ల ఐరన్ శాతం ఎంతో పెరుగుతుంది. ఈ ఫలాలన్నింటిలో ఐరన్ సమృద్ధిగా ఉంది. రోజూ వీటన్నింటినీ కలిపి కనీసం ఒక్క సర్వింగ్ తీసుకుంటే చాలు.. మనం తీసుకోవాల్సిన ఐరన్‌లో పది నుంచి ఇరవై శాతం మనకు అందినట్లే.. అయితే తగిన మోతాదులోనే తీసుకోవాలి.. లేదంటే బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. రోజూ రకానికి రెండు, మూడు పండ్లు మాత్రమే తినడం బెటర్.

ఇలా బాడీలో ఐరన్ లోపం ఉన్నవారు.. వీటిని మీ డైట్ లో భాగం చేసుకుంటే సరీ.. ఇష్టమైనవి తింటూనే.. ఐరన్ లోపాన్ని భర్తీచేయడం అంటే ఇదే కదా..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version