తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు..

-

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల పై గవర్నర్ తమిళి సై తీవ్ర విమర్శలు చేశారు.మంత్రులు ఎమ్మెల్యేలు తనను ఇష్టానుసారంగా విమర్శించారని ఆరోపించారు.తనను పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.తాను ప్రజల సమస్యలను పరిష్కరించడం తప్పా?అని ప్రశ్నించారు.ఏ పదవిలో ఉన్న ప్రజాసేవే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు.ప్రోటోకాల్ ఉల్లంఘన పై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.తెలంగాణలో తాను రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని తమిళిసై కామెంట్ చేశారు.ఢిల్లీలో కేంద్ర మంత్రి కొడుకు పెళ్లికి హాజరైన గవర్నర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు.

తాను ఎక్కడ రాజకీయం చేయడం లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రతి నెల కేంద్రానికి ఇచ్చిన నివేదికలో చెప్పాల్సినవి చెబుతున్నారని అన్నారు.గవర్నర్ విషయంలో ప్రోటోకాల్ పాటించని కేంద్ర సర్వీసుల్లో ని అధికారుల విషయంలో కేంద్రమే తీసుకునే చర్యలు తీసుకుంటుందని అన్నారు.గవర్నర్ గా తనకు అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈ పదవి ఇచ్చారని మరోసారి స్పష్టం చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version