డార్లింగ్ ప్రభాస్ ‘రాజాసాబ్’ పోస్టర్ రిలీజ్.. త్వరలో చితకొట్టేద్దాం అంటూ!

-

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో డార్లింగ్ ప్రభాస్‌కు జోడిగా హీరోయిన్ మాళవిక మోహన్, మరో నటి నిధి అగర్వాల్, రిద్దికుమార్‌లు నటిస్తున్నారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాజసాబ్ చిత్ర యూనిట్ డార్లింగ్ ప్రభాస్ మూవీ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ సైడ్ లుకింగ్‌లో గ్లాసెస్ పెట్టుకుని స్మైల్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ సైతం చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు దర్శకుడు మారుతి. ఈ మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్ల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ ఆడియో లాంచింగ్‌ను జ‌పాన్‌లో చేస్తారని మ్యూజిక్ డైరెక్టర్ త‌మ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. సంక్రాంతికి పండుగకు డార్లింగ్ ప్రభాస్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version