రూ.100 కోట్ల క్లబ్​లో దసరా.. నాని ధూమ్​ధామ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్

-

నేచురల్‌ స్టార్‌ నాని, నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో తెరకెక్కిన ఊరమాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘దసరా’ వంద కోట్ల క్లబ్​లో చేరింది. విడుదలైన వారం రోజుల్లో రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. నేచురల్​ స్టార్​ నాని ప్రస్తుతం దసరా సినిమా సక్సెస్​ను​ ఆస్వాదిస్తున్నారు. ఇక సక్సెస్​ మీట్లలో పాల్గొంటూ మంచి జోష్​లో ఉన్నారు.

సినిమా విజయం పట్ల ఫుల్‌ఖుష్‌లో ఉన్న నిర్మాత చెరుకూరి సుధాకర్‌ చిత్రబృందంతో తన ఆనందాన్ని పంచుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించారు. అలాగే సినిమా కోసం పని చేసిన వారందరికీ 10 గ్రాముల బంగారు నాణెలను ఇచ్చారు. ఇక దసరా విజయోత్సవాల్లో చిత్రబృందంతో కలిసి నాని ఫుల్ ఎంజాయ్ చేశారు. దసరా టీమ్​తో కలిసి స్టెప్పులేశారు. ‘దసరా’లో వెన్నెలగా కీర్తి సురేశ్‌ చేసిన బారాత్‌ స్టెప్పులను సుమ రీక్రియేట్‌ చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version