నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేం కీర్తి సురేశ్ జంటగా నటించిన సినిమా దసరా. ఈ సినిమా రిలీజ్ అయి రెండు వారాలు దాటినా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. ఈ మూవీతో నాని, కీర్తిల జంట మరోసారి ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ చిత్రంతో నాని వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజాగా దసరా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దసరా సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఏప్రిల్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ముందుగా డీల్ కుదిరించుకున్న ప్రకారమే ఈ సినిమాను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన దసరా ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో నాని ధరణి పాత్ర పోషించగా.. కీర్తి వెన్నెలగా నటించింది.