‘తిరగబడుదాం.. తరిమికొడదాం’’ అనేది ప్రజాస్వామిక సిద్ధాంతమా? : దాసోజు

-

తిరగబడటం తరిమికొడదాం అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు కురిపించారు. రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజాకోర్టు ఓ అట్టర్ ప్లాప్ షో అని, బాహుబలి సెట్టింగ్ వేసి.. పులకేశి సినిమా చూపించాడని దాసోజు శ్రవణ్ సెటైర్ వేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాకోర్టులో ప్రజలులేని ఖాళీ కుర్చీలకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై రేవంత్ కాంగ్రెస్‌కు నమ్మకం పోయిందా? అని ప్రశ్నించారు.

కొండంత రాగం తీసి రేవంత్ పాట పడినట్లుందని, ప్రజాకోర్టు ఓ అట్టర్ ప్లాప్ షో అన్నారు. ‘తిరగబడుదాం.. తరిమికొడదాం’’ అనేది ప్రజాస్వామిక సిద్ధాంతమా? లేక తెలంగాణ నయా నయీం రేవంత్ తీవ్రవాదమా? అని విమర్శించారు. కాంగ్రెస్ ఓట్ల పోరాటంలో ఉందా? లేక తూటాల పోరాటంలో ఉందా? అని అన్నారు. తెలంగాణ ప్రజలు మాకు ఓట్లు వెయ్యరని రేవంత్, కాంగ్రెస్ పార్టీ ముందే చేతులెత్తేసిందా? అని ఎద్దేవా చేశారు. ప్రజలు లేని ఖాళీ కుర్చీల ప్రజాకోర్టు ఆసాంతం కేసీఆర్‌పై అక్కసుతో కడుపు మంటలు, కక్కుర్తి అరుపులు, ఊపిరితిత్తులు పగిలేలా ఊకదంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైన ఆరోపణలు అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version