విశాఖలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. అయితే.. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు మీద పోరాటం చేస్తుంటే సీఎం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైజాగ్ ఎంపీ ఒక రౌడీషీటర్…. ఒక రౌడీషీటర్ ను వైజాగ్ ఎంపీగా గెలిపించారని, అటువంటి ఎంపీ ప్రధాని దగ్గరకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడగలరా…?. అని ఆయన అన్నారు. ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటులో ఎందుకు నిలబడలేకపోతున్నారని ఆయన మండిప్డడారు. విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన రైతులు పరిహారం రాక ఇప్పటికీ ఆలయాల్లో ప్రసాదాలు తిని బ్రతకలిసిన పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘నాకు పోరాటం నేర్పింది ఉత్తరాంధ్ర… 2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయం. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. గాజువాకను నేను ఎప్పుడు వదల్లేదు. నేను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదు.
జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోంది. కేసులున్నోడికి, మర్డర్ లు ,లూటీ లు చేయించేవాడికి ధైర్యం ఉండదు. నేను ప్రధాని, హోమ్ మంత్రి కాళ్ళ మీద పడైన నేను సాధించగలను.. ఆంధ్రా ఎంపీలంటే దోపిడీ దారులనే అభిప్రాయం ఢిల్లీ పెద్దల్లో ఉంది.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తాను..స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, పార్టీలు కలిసి వస్తే ఐరన్ ఓర్ సొంత గనులు కేటాయించే వరకు బాధ్యత తీసుకుంటాను.. గంగవరం పోర్టు వల్ల నిర్వాసితులను ఆదుకోవాలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ.. ప్రభుత్వంపై ప్రజల్లో కోపం వ్యతిరేకత పెరుగుతోంది..గంగవరంలో దోపిడీకి గురైన కార్మికులుకు న్యాయం జరగకపోతే హర్తాళ్ కు దిగుతాం.’ అని పవన్ అన్నారు.