ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ నుంచి వచ్చిన డేటా ఇప్పుడు సంచలనం అయింది. డేటా షాట్ ఫలితాల ప్రకారం చూస్తే… ఒక డోస్ 80% వరకు ప్రజల ప్రాణాలు కాపాడుతుందని తెలుస్తుంది. కరోనా నుంచి రక్షణగా సమర్ధవంతంగా నిలుస్తుందని గుర్తించారు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ సోమవారం దీనిపై ప్రకటన చేసింది. రెండు మోతాదుల తరువాత 97% వరకు పెరుగుతుందని కొత్త విశ్లేషణలో తెలిపింది.
డిసెంబర్ మరియు ఏప్రిల్ మధ్య కోవిడ్ -19 రోగులపై జరిపిన అధ్యయనంలో గుర్తించారు. కరోనా వచ్చిన తర్వాత తర్వాత 28 రోజుల్లో మరణించిన వ్యక్తులను కూడా పరిశీలించారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం ఇంగ్లాండ్‌లో లాక్డౌన్ ఆంక్షలను సడలించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది.