రకరకాల రూపాల్లో అనేక మోసాలు నగరవాసులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని మోసం చేసేందుకు మోసగాళ్లు చిత్ర విచిత్ర వేశాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంక్ లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, డెబిల్ కార్డులు మోసాగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా అక్కడోకక్కడ.. ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. ఇక తాజాగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్, స్నాప్ డీల్, క్లబ్ ఫ్యాక్టరీ వంటి వాటి నుండి డేటా లీక్ అవడంతో వినియోగదారులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. కొందరు మోసగాళ్లు టెక్నాలజీని వినియోగించి, తెలివిగా భారీగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్, తదితర సంస్థల నుండి కస్టమర్ల డేటా ని తస్కరించారు.
దానితో కస్టమర్లకు ఫోన్లు చేసి, మీకు బహుమతులు వచ్చాయి, ముందుగా డబ్బులు కట్టండి అంటూ తప్పుడు కాల్స్ చేస్తారు. అయితే అది నిజంగానే సదరు సంస్థ నుండి వచ్చిన కాల్ అని భావించిన కస్టమర్, వారికి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. కాగా డబ్బులు తీసుకున్న తరువాత ఏ మాత్రం స్పందించని ముఠా, తెలివిగా ఫోన్ నెంబర్ తీసేస్తుంది. ఈ తరహా నయా మోసాన్ని నేడు సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. కొందరు వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతలను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.