రేణూ దేశాయ్‌కు సాయం చేసిన మెగా ఫ్యామిలీ కోడలు!

-

నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల పెట్స్ సంరక్షణ కోసం ఓ ఎన్జీవో సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె తన అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్ నుంచి విరాళాలు సైతం ఆశించారు. పెట్స్ సంరక్షణ అనేది చిన్ననాటి నుంచి తన కల అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రేణూ దేశాయ్ ట్వీట్‌కు మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన స్పందించారు.

ఉపాసన చెర్రీ దంపతులకు పెట్స్ అంటే చాలా ఇష్టం.వీరిద్దరూ కలిసి ‘రైమ్’ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. దానిని వారి కుటుంబంలో భాగంగా చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఉపాసన రేణూ దేశాయ్ పిలుపు మేరకు సాయం చేసినట్లు తెలుస్తోంది. రేణూ స్థాపించిన ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ మూగజీవాలను రెస్క్యూ చేస్తుంటుంది. రేణూ చేస్తున్న ఈ మంచి పనికోసం తన పెంపుడు కుక్క రైమ్ పేరిట రెస్య్కూ వ్యాన్ కొనుగోలుకు ఉపాసన సాయం చేశారట. అందుకు ‘థాంక్యూ
రైమ్, ఉపాసన’ అని రేణూదేశాయ్ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news