తండ్రి పాడె మోసి.. అంత్యక్రియలు చేసిన 12 మంది కుమార్తెలు..

-

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. హిందువుల్లో తల్లి, లేదా తండ్రి చనిపోతే కొడుకులు అంత్యక్రియలు చేస్తారు. ఒకవేళ కొడుకులు లేకుంటే ఇంట్లో ఉన్న ఎవరో ఒక మగవారు చేస్తారు. కానీ తాజాగా 12 మంది కుమార్తెలు తండ్రికి అంత్యక్రియలు చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. 12 మంది కుమార్తెలు తమ తండ్రి పాడె మోసి, దహన సంస్కారాలు నిర్వహించారు.

ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని వాషీమ్ జిల్లా షెందుర్జన్‌ గ్రామానికి చెందిన సఖారామ్ గణపతిరావు తన 92 ఏట అంటే రెండ్రోజుల క్రితం కన్నుమూశారు. ఆయనకు 12 మంది కూతుళ్లు ఉన్నారు. కొడుకులు లేకపోవటంతో గణపతిరావుకు అంత్యక్రియలను అతని కుమార్తెలే పూర్తిచేశారు . 12 మంది కుమార్తెలు తండ్రి పాడె మోసి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చితికి అందరూ కలిసే నిప్పంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version