సెంచరీ తో ఫామ్ లోకి వచ్చిన డేంజరస్ “డేవిడ్ వార్నర్”… !

-

ఈ రోజు సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన సెకండ్ వన్ డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదట టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా కు ఓపెనర్లు వార్నర్ మరియు హెడ్ లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 109 పరుగులు జోడించారు.. ఆ తర్వాత వెంట వెంటనే హెడ్ (64) మరియు మార్ష్ (0) వికెట్ లను కోల్పోయింది . ఆ తర్వాత వార్నర్ కు జత కలిసిన లబుచెన్ మూడవ వికెట్ కు సాలిడ్ గా ఆడారు అని చెప్పాలి. ఈ సందర్భంగా వార్నర్ వన్ డే లలో మరి సెంచరీ ని సాధించాడు. వార్నర్ 93 బంతుల్లో 12 ఫోర్లు మూడు సిక్సులతో 106 పరుగులు చేశాడు. చాలా కాలంగా సరైన ఫామ్ లో లేడు..

కానీ ఈ మ్యాచ్ తో వార్నర్ భీకరమైన ఫామ్ లోకి వచ్చాడు. వన్ డే కెరీర్ లో 20 వ సెంటురీ సాధించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 400 పరుగులకు సాధించే దిశగా దూసుకుపోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version