THE HUNDRED 2023 :దుమ్ములేపిన డేవిడ్ వీజ్ 25 బంతుల్లో 54 పరుగులు … !

-

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో భాగంగా నార్తెర్స్ సూపర్ ఛార్జర్స్ మరియు ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తెర్స్ సూపర్ ఛార్జర్స్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అయితే మొదటగా చూస్తే నార్తర్న్ జట్టు ఈ మాత్రం స్కోర్ చేస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే … కేవలం 9 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక పరుగులకే అయిదు వికెట్లు పడిపోయిన దశలో క్రీజులోకి వచ్చిన బ్రైడన్ కార్స్ మరియు డేవిడ్ వీజ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఆరవ వికెట్ కు 72 పరుగులు జోడించి ఛాలెంజింగ్ టోటల్ ను అందించారు. ఇక వీరిలో డేవిడ్ వీజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు మరియు 4 సిక్సులతో 54 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.

మరి ఈ స్కోర్ ను నార్తర్న్ బౌలర్లు డిఫెండ్ చేసి జట్టుకు విజయాన్ని అందిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version