ఇండియా స్టార్ ప్లేయర్ గా కితాబు అందుకున్న అతి తక్కువ మంది యంగ్ ప్లేయర్ లలో శుబ్ మాన్ గిల్ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కొంత కాలంలోనే తనదైన నిలకడ అయిన ఇన్నింగ్స్ లతో సీనియర్ లను సైతం మురిపించాడు. కట్ చేస్తే వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న ఇండియా టీం లో సభ్యుడిగా ఉన్న శుబ్ మాన్ గిల్ వరుసగా విఫలం అవుతూ జట్టులో చోటు దక్కుతుందా అన్న అనుమానాలను ప్రేక్షకులకు కలిగేలా చేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో అయితే వరుసగా మూడు సెంచరీ లు మరియు నాలుగు అర్ద సెంచరీ లతో రాణించిన గిల్ .. ఆ తర్వాత జరిగిన 11 అంతర్జాతీయ మ్యాచ్ లలో దారుణంగా విఫలం అయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి కేవలం 31 పరుగులు చేశాడు, విండీస్ తో రెండు టెస్ట్ లలో 45 పరుగులు చేశాడు.
శుబ్ మాన్ గిల్ కు ఏమైంది … “బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్”
-