లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ గురువారం బీహార్ సిఎం నితీష్ కుమార్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని సవాలు చేస్తూ ఆయన ఆరోపణలు చేసారు. 2005 తరువాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎందుకు పోటీ చేయలేదని చిరాగ్ పాస్వాన్ ప్రశ్నించారు . రాష్ట్రంలో ముఖ్యమంత్రికి “ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ లేదు” అని అన్నారు.
ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ… “నా తండ్రి లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిదిసార్లు గెలిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 2020 లో పోటీ చేయాలి. నితీష్ కుమార్‌కు రాష్ట్ర ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ లేదు.” అన్నారు. నితీష్ కుమార్ అహంకార వ్యక్తి అంటూ ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో నితీష్ విజయం సాధించలేరు అని సవాల్ చేసారు.