డియర్ కళ్యాణ్ బాబు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: చిరంజీవి

-

ఏపీ అసెంబ్లీ తో పాటు లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టిస్తుంది. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్..తాను అనుకున్నది సాధించారు.జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవర్ స్టార్ ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ గెలవడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్ కళ్యాణ్ బాబు.. నువ్వు తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version