విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను డెక్కన్ క్రానికల్ దెబ్బతీస్తుందని, ఇది బాధకరమని, ఇది వైసీపీ తోక పత్రిక అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఇవాళ ఎమ్మెల్యే కార్యాలయంలో గణబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రికలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వచ్చిన కథనానికి పత్రికపై ఫైర్ అయ్యారు. డెక్కన్ క్రానికల్ కూడా నీలిమీడియా పక్షాన చేరిపోయిందని అన్నారు. విశాఖలో ఉద్యమాలు చేసి స్టీల్ ప్లాంట్ సాధించామని ఆయన గుర్తుచేశారు.
సాక్షిలో పనిచేసి ఇప్పుడు డెక్కన్ క్రానికల్ జాయిన్ అయిన ఓ వ్యక్తి ఇలా చేస్తున్నారని ,అందరి మనోభావాలతో కూడుకున్న ఈ ప్లాంట్‌పై ఇలాంటి సమయంలో దుష్ప్రచారం చేయడం దురదృష్ట కరమని ఆయన అన్నారు.మొన్నటివరకు జగన్ రెడ్డి కంపెనీలో పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు డెక్కన్ క్రానికల్లో చేరడం వల్ల ఈ వార్తను ప్రచురించారని ,డెక్కన్ క్రానికల్‌పై ప్రభుత్వ పరంగా న్యాయ పోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు .ఇప్పటికి పద్ధతి మార్చుకోకుండా లేని వార్తను, తప్పుడు కథనాలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.