Andhra Pradesh:ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు

-

ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కులు అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.ఇకపై పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు “టీ విత్ డిప్యూటీ సీఎం” కార్యక్రమాన్ని నిర్వహించారు. జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసేందుకు ఆయన చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం, తిరుపతి జంతు ప్రదర్శనశాలలకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.జూపార్కులకు ఎక్కువ మంది వచ్చేలా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news