డిసెంబర్‌ 07 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

కార్తీకమాసం- డిసెంబర్‌-7- సోమవారం.

మేషరాశి:ఈరోజు వ్యాపారాభివృద్ధి కోసం శ్రమిస్తారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లో సాధారణంగా ఉంటుంది. ఇంటర్యూవకు హాజరయ్యే వారికి పరీక్ష కాలంగా చెప్పవచ్చు. కుటుంబంలో సభ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. వాహనాలు నడిపేటటప్పుడు జాగ్రత్త. దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి బాగా కష్టపడుతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీమల్లికార్జున స్వామి ఆరాధన, స్తోత్రం పారాయణం చేయండి.

todays horoscope

వృషభరాశి:ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆఫీస్‌లో ఓర్పుతో పనిచేయండి. వివాదాలకు దూరంగా ఉండండి. బాకీలు తీరుస్తారు. పనులు వాయిదా పడుతుంటాయి. కానీ పట్టుదలతో వాటిని చేయాలని ప్రయత్నిస్తారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితం వస్తుంది.

 

మిథునరాశి:ఈరోజు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది !

ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి ఒత్తిడి, అధికమవుతుంది. పనులు వాయిదా పడుతాయి. ప్రయాణాలలో మీ సామాన్లు జాగ్రత్త. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.

 

కర్కాటకరాశి:ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు !

ఈరోజు మీ ఆలోచనలను ఎవరికి చెప్పకండి. గోప్యత పాటించండి. చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ఆఫీస్‌లో మీపై పర్యవేక్షణ ఉందన్న విషయం మరిచిపోకండి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

 

సింహరాశి:ఈరోజు ప్రయాణాలు కలసివస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. మీకు ఈరోజు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. ప్రయాణాలలో మీ వస్తువులు జాగ్రత్త. అనుకోని అతిథి మీ ఇంటికి వస్తారు. వైవాహికంగా సంతోషమైన జీవితాన్ని గడుపుతారు.

పరిహారాలుః శివుడికి పంచామృతాభిషేకం చేయండి.

 

కన్యరాశి:ఈరోజు ఖర్చులు అధికమవుతాయి !

ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో శుభకార్యానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. అనుకోని ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులు సమయం వృథా చేస్తారు. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శివాలయంలో ప్రదక్షణలు చేయండి. వీలైతే సోమవార ఉపవాసాన్ని పాటించండి.

 

తులరాశి:ఈరోజు స్థిరాస్థి సంబంధ లావాదేవీలు చేస్తారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీకు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. కానీ ఏదో తెలియని అసంతృప్తి. అనుకోని ఖర్చులు, వ్యయం అవుతుంది. మీరు చేసే స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి విందులు, వేడుకలలో పాల్గొంటారు. వైవాహికంగా సంతోషకరమైన జీవితం గడుపుతారు.

పరిహారాలుః శివపంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపం చేయండి.

 

వృశ్చికరాశి:ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతికి అవకాశం !

ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆఫీస్‌లలో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రమోషన్, ప్రత్యేక ఇంక్రిమెంట్లు, బోనస్ వంటి శుభవార్తలు వింటారు. మీ స్నేహితలకు ఆర్థిక సహాయం చేస్తారు.  నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివకవచం పారాయణం చేయండి.

 

ధనస్సురాశి:ఈరోజు శత్రువులు మిత్రులుగా మారుతారు !

ఈరోజు అనుకోని ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి ఇబ్బంది ఉండదు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వైవాహికంగా చిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి మరింత మంచి ఫలితాలు వస్తాయి.

 

మకరరాశి:ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయి !

ఈరోజు కుటుంబంలో సంతోషం,. అనుకోని అతిథి రాక. కుటుంబ పరిస్థితులతో అందరితో సర్దుకుపోవడం మంచిది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన సమయం. మీరు చూపించే తెలివితేటలు, పట్టువిడుపు ధోరణితో మీ సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీ, సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.

 

కుంభరాశి:ఈరోజు మీకు గుర్తింపు !

ఈరోజు మీకు అలసట, వత్తిడి ఉంటుంది. ఇంటికి బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల నుంచి బహుమతులు అందుకుంటారు విద్యార్థుల్లో ఏకాగ్రతా లోపం, నిదానం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి.వైవాహికంగా ఆనందమైన సమయం.

పరిహారాలుః శ్రీచంద్రగ్రహారాధన చేయండి.

 

 

మీనరాశి:ఈరోజు వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు ఓపికతో, సహనంతో వ్యవహరించండి. మీ చుట్టూ ఉండే వారి వల్ల ఇబ్బందులు తప్పవు. మీరు చిరకాలంగా అనుకుంటున్న వ్యాపారం చేయాలని సంకల్పం ఫలిస్తుంది. మీ భాగస్వామి వైఖరితో మీకు చికాకు కలుగుతుంది. కానీ చివరకు అంతా సర్దుకుంటుంది.

పరిహారాలుః సోమవారం ఉపవాసం, శివ ఆరాధన చేయండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news