పెట్రో ధరలు సెంచరీని చేరుకుంటాయనుకునే సందర్భంలో సామాన్యుడికి కాస్త ఊరటను కలిగించేలా పెట్రో ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో శుక్రవారం కూడా దేశీయంగా పెట్రోలు , డీజిల్ ధరలు తగ్గాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 21 పైసలు తగ్గి.. లీటర్ పెట్రోల్ ధర రూ.79.18 కి చేరగా.. డీజిల్ ధర 14 పైసలు తగ్గి రూ.73.64 కి చేరింది. ముంబయిలో 18 పైసలు తగ్గిన పెట్రోల్ రూ.84.68 కి చేరగా.. డీజిల్ ధర 14 పైసలు తగ్గి రూ.77.18గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో 18 పైసలు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర రూ.83.96 కి చేరగా, డీజిల్ ధర 13 పైసలు తగ్గి రూ. 80.12 కి చేరింది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.83.68 ఉండగా.. డీజిల్ ధర రూ.79.04 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ తగ్గడంతో దేశ వ్యాప్తంగా సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగింది.