సవ్యసాచి ఫస్ట్ షో టాక్

-

నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా యూఎస్ లో ఆల్రెడీ ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రేమమ్ సినిమా తర్వాత చైతు, చందు మొండేటి కలిసి చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికి ఈ సినిమా మొదటి 15 నిమిషాలు మాత్రమే ఇంట్రెస్ట్ గా ఉందని ఆ తర్వాత దర్శకుడు రొటీన్ గానే నడిపించాడని అంటున్నారు. ఇక సినిమాలో చైతు మేనరిజం బాగుందని టాక్ వచ్చింది. సినిమాలో మాధవన్ విలనిజం కూడా అదిరిపోయిందట.

నాగ చైతన్య, మాధవ్న్ ల మధ్య సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయని తెలుస్తుంది. హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ షో కూడా సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. యూఎస్ లో ఈ సినిమా కొన్ని చోట్ల సూపర్ టాక్ తెచ్చుకోగా మరికొన్ని చోట్ల మాత్రం ఎబో యావరేజ్ అన్నట్టుగా చెబుతున్నారు. కొన్నాళ్లుగా మాస్ ఇమేజ్ సంపాదించాలని చూస్తున్న నాగ చైతన్య సవ్యసాచి మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. కీరవాణి మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని అంటున్నారు. నాగార్జున సూపర్ హిట్ సాంగ్ నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు సాంగ్ అయితే అక్కినేని ఫ్యాన్స్ ను అలరించేలా ఉందని అంటున్నారు. మరి అసలు ఒరిజినల్ టాక్ ఏంటి అన్నది తెలుగు రాష్ట్రాల్లో షోస్ పడ్డాక తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version