ఏపీ మంత్రి నారా లోకేశ్ విశాఖ చేరుకున్నారు. ఓ పత్రికపై ఆయన వేసిన పరువునష్టం దావా కేసులో నేడు క్రాస్ ఎగ్జామిన్ జరగనుంది. ఈ క్రమంలోనే ఆయన విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో హాజరయ్యేందుకు జిల్లాకు చేరుకున్నారు. మంత్రి నారా లోకేశ్ ధర్మాసనం ఎదుట హాజరై తనపై తప్పుడు ప్రచారం చేసిన పత్రికపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరనున్నారు.
ఇప్పటికే పలుమార్లు ఈ కేసులో కోర్టుకు హాజరై నారా లోకేశ్ వివరణ ఇచ్చారు.తాజాగా సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అందుకే ఆయన అమరావతి నుంచి విశాఖకు నిన్ననే చేరుకున్నారు.నారా లోకేశ్ కోర్టుకు హాజరయ్యే విషయాన్ని పార్టీ వర్గాలు బయటకు వెల్లడించాయి. కాగా, విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేశ్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.