పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చర్యలు ప్రస్తుతం అందరికీ నవ్వు తెప్పించేలా ఉన్నాయని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన సదరు ఎమ్మెల్యే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే, తనకు తెలీకుండా కొందరు తన ఫోటోలను కాంగ్రెస్ ఫ్లెక్సీలలో వాడుతున్నారని ఆయన వారిపై కేసు పెట్టడం గమనార్హం.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసే అవకాశాలు కనిపిస్తుండటంతో ఆయన కొత్త డ్రామాకు తెరలేపారని టాక్ వినిపిస్తోంది. కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా వృత్తి రీత్యా తాను రైతునని ఎఫ్ఐఆర్లో ఆయన పేర్కొనడం విశేషం.
https://twitter.com/TeluguScribe/status/1894664234484523263