రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. బుధవారం ఉదయం ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమావేశమైనట్లు సమాచారం.వీరంతా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరందరికీ స్పీకర్ కార్యాలయం నోటిసులు జారీ చేసింది. దీంతో భవిష్యత్ కార్యాచరణ గురించి ఏం చేయాలన్నదానిపై దానం నాగేందర్ ఇంట్లో వీరంతా సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపైనా ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు.
అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన నోటీసుకు,సుప్రీంకోర్టుకు ఏ విధమైన సమాధానం ఇవ్వాలి అనే అంశాలపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారు.