ఏపీలో విద్యార్థులకు అలర్ట్‌.. డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్‌ మార్పు

-

ఏపీలో ఈ ఏడాది డిగ్రీలో ప్రవేశం పొందబోతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్‌ మార్పు చేసినట్లు కన్వీనర్‌ ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూర్యచంద్రరావు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఏదైనా సర్టిఫికెట్‌ పొందుపరచడం మరిచిపోతే, ఈ నెల 16 నుంచి 18 వరకు పెండింగ్‌ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసి, మరోమారు ధ్రువీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించారు సూర్యచంద్రరావు.

గుర్తింపు (అఫిలియేషన్‌) ఇచ్చిన కాలేజీల జాబితాను యూనివర్సిటీ అధికారులు ఈనెల 20, 21 తేదీల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు సూర్యచంద్రరావు. ఈ నెల 22 నుంచి 26 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో డిగ్రీ ప్రవేశం కోసం వెబ్‌సైట్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలని, 30న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు సూర్యచంద్రరావు. సెప్టెంబర్‌ ఒకటి, రెండో తేదీల్లో విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలి. సెప్టెంబర్‌ రెండో తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేలా ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version