తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు..?

-

కరోనా నేపధ్యంలో ప్రపంచమంతా అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడి బతుకులు అక్కడే ఆగిపోయాయి. ముఖ్యంగా విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. పరీక్షలు జరుగుతాయో లేక తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. అలాగే పదవ తరగతి పరీక్షలపై కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఇంకా చాలా పరీక్షలు పెండింగ్ ఉన్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఎప్పుడు పరీక్షలపై ఒక క్లారిటీ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా డిగ్రీ పరీక్షలపై తెలంగాణ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.

తెలంగాణలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎ, బీఎస్సీ, బీకాం డిగ్రీ పరీక్షలను పూర్తిగా రద్దుచేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అధికారులు, ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు పరీక్షల రద్దుకే మొగ్గు చూపినట్టు తెలిసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేస్తే బాగుంటుందని సూచించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version