దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్‌డిఎంసి) పరిధిలోని మృతదేహాల దహన సంస్కారాలకు చెక్కలకు బదులుగా ఆవు పేడను పిడకలను ఉపయోగిస్తారు అని అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో బిజెపి నేతృత్వంలోని ఎస్‌డిఎంసి హౌస్ తన సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించింది అని కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ ఢిల్లీ మేయర్ అనామికా మాట్లాడుతూ…
“చెక్కకు బదులుగా, ఎస్‌డిఎంసి ప్రాంతంలోని శ్మశానవాటికలో మృతదేహాల చివరి కర్మలు చేయడానికి ఆవు పేడ చితిని ఉపయోగిస్తారు అని తెలిపారు. కలప, ఆవు పేడ ఇటుకలు మరియు స్ట్రాస్ ను ఉపయోగిస్తారని వివరించారు. పేడ ఇటుకలు చిన్నవి కావడంతో ప్రజలు కలపను ఇష్టపడతారు. ఇప్పుడు ఆవు పేడ చితిని ఉపయోగించడానికి అనుమతించాలని కార్పొరేషన్ సమావేశంలో ఒక ప్రతిపాదనను ఆమోదించారని వివరించారు.
“చెక్క లాగ్లతో పోల్చితే ఆవు పేడ లాగ్ల రేటు కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఆవు పేడ వాడకం కూడా మన సంస్కృతికి సంబంధించినది” అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి కొన్ని సామాజిక సంస్థలు తమ మద్దతును అందించాయని ఎస్‌డిఎంసి మేయర్ తెలిపారు. ప్రజలు వీలైనంత త్వరగా ఈ సదుపాయాన్ని పొందడం ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.