ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు అస్వ‌స్థ‌త‌.. క‌రోనాగా అనుమానం..?

-

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న‌కు గొంతు నొప్పి, తేలిక‌పాటి జ్వ‌రం రావ‌డంతో ఆయ‌న సోమ‌వారం హాజరు కావ‌ల్సిన కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఇక ఆయ‌న‌కు ఉన్న ల‌క్ష‌ణాలు క‌రోనాకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో.. ఆయ‌న‌కు క‌రోనా సోకి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. దీంతో ఆయ‌న‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం కరోనా టెస్టు చేయ‌నున్నారు.

కాగా ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 27,654 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 10,664 మంది రిక‌వ‌రీ అయ్యారు. 761 మంది చ‌నిపోయారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ రోజు రోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో కేవ‌లం ఢిల్లీకి చెందిన స్థానికుల‌కే అక్క‌డి హాస్పిట‌ళ్ల‌లో చికిత్స అందించాల‌ని కేజ్రీవాల్ నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య బాగా ఎక్కువ‌వుతుండ‌డంతో అక్క‌డ రోగుల‌కు చికిత్స చేసేందుకు బెడ్లు స‌రిపోవ‌డం లేదు. అందువ‌ల్లే కేజ్రీవాల్ కేవ‌లం స్థానికుల‌కే హాస్పిట‌ళ్ల‌లో చికిత్స అందించాల‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version