కరోనా మహమ్మారి భారత్ లో విలయతాండవం చేస్తుంది.. మృత్యుఘంటికలు మోగిస్తుంది. రోజురోజుకి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు, నాయకులు, తారలు, అధికారులు అనే తేడా లేకుండా అందరినీ పలకరిస్తుంది ఈ మహమ్మారి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది నాయకులు దీని బారిన పడ్డారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఇదే పరిస్థితి. కరోనాతో బాధపడుతున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఈశాన్య ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరగడం, దానికి న్యుమోనియా కూడా జతకావడంతో వైద్యులు ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు.
కరోనా బారిన పడ్డ మంత్రి.. క్షీణించిన ఆరోగ్యం..!
-