మోడీకి అగ్ని ప‌రీక్ష‌లు.. కొత్త‌‌గా మూడు..!

-

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు కొత్త‌గా మూడు చిక్కులు వ‌చ్చిప‌డ్డాయి. వీటిలో రెండు అగ్ని ప రీ క్షలే ! నిజానికి తాము రెండో సారి అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో బీజేపీ శ్రేణులు దేశ వ్యాప్తంగా  సంబ‌రాలు చేసుకున్నాయి. ఇంకేముంది.. మోడీ కాబ‌ట్టి ఈ దేశాన్ని అభివృద్ధి ప‌థంలో ముం దుకు తీసు కు వెళ్తున్నార‌ని బీజేపీ నాయ‌కులు నిరాటంకంగా.. బాజా భ‌జంత్రీలు మోగించారు. ఇది జ‌రిగి ప‌ట్టుమని మూడు శుక్ర‌వారాలు కూడా గ‌డ‌వ‌క‌ముందుగానే.. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం తీవ్ర ‌మైన అగ్ని ప‌రీక్ష‌ల దిశ‌గా అడుగులు వేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే దాయాది దేశం పాకిస్థాన్ నుంచి ఎప్పుడు ఎలాంటి దాడి జ‌రుగుతుందో అనే అప్ర‌మ‌త్త‌త‌తో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి.

ఇంత‌లోనే నిన్న‌టి వ‌రకు మిత్ర దేశాలుగా ఉన్న నేపాల్‌, చైనాల నుంచి ఇప్పుడు తీవ్ర‌మైన విదేశీ యు ద్దం జ‌రుగుతోంది. పైకి కేంద్ర ప్ర‌భుత్వం మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ రెండు దేశాల విష‌యంలో అనుస ‌రించే వ్యూహంపై మాత్రం తీవ్ర‌స్థాయిలో క‌స‌ర‌త్తు ప్రారంభించింది. భార‌త్‌-చైనాల స‌రిహ‌ద్దు వెంబ‌డి.. గాల్వానా లోయ‌లో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త‌లు భార‌త్‌కు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఈశాన్య ల‌ద్ధాఖ్ ప్రాంతంలో ఉన్న గాల్వానా న‌దిని పూడ్చివేయ‌డానికి లేదా.. ఇక్క‌డ ప్ర‌వాహాన్ని అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే సైనికుల‌ను భారీ ఎత్తున స‌రిహ‌ద్దు వెంబ‌డి మోహ‌రించింది.

దీనిని ప‌సిగ‌ట్టిన భార‌త్ ఆర్మీ.. కూడా సైన్యాన్ని ఈ ప్రాంతంలో మోహ‌రించింది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల పెద్ద ఎత్తున ఇరు దేశాల సైనికుల మ‌ధ్య బాహాబాహీ జ‌రిగి క‌ల్న‌ల్ సంతోష్ స‌హా 24 మంది వీర‌మ‌ర‌ణం చెందారు. ఇది ఇప్పుడు మోడీ ప్ర‌భుత్వానికి పెను స‌వాలుగా మారింది. మ‌రోప‌క్క‌, చైనా ఉత్ప‌త్తుల‌ను వినియోగించ‌బోమ‌నే తిరుగుబాటు కూడా ప్ర‌జ‌ల్లో వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు స‌ర్దుబాటు చేయ‌డం.. అనేది మోడీ స‌ర్కారుకు పెను స‌వాలే. మ‌రోకీల‌క స‌మ‌స్య ప‌క్కనే ఉన్న మిత్ర దేశం.. నేపాల్ నుంచి ఎదుర‌వుతోంది. నేపాల్ స‌రిహ‌ద్దుల‌ను మారుస్తూ.. ఆ దేశం.. జాతీయ చిత్ర‌ప‌టాన్ని(మ్యాప్‌) తాజాగా రూపొందించింది.

దీనిలో భార‌త్ భూభాగంలో ఉన్న లింపి యాధురా, లిపిలేఖ్‌, కాలాపానీ వంటి వాటిని నేపాల్ త‌న భూభా గం కింద పేర్కొంటూ..కొత్త‌గా మ్యాప్‌ను రూపొందించింది. దీనిపై వారం ప‌ది రోజులుగా ఇరు దేశాల మ‌ధ్య వివాదం నడుస్తోంది. అయితే, అనూహ్యంగా నేపాల్ పార్ల‌మెంటు.. ఈ మార్పుల‌తో కూడిన నైస‌ర్గిక ‌ప‌టానికి ఆమోదం తెలిపింది. దీనిపై నేపాల్ అధ్య‌క్షురాలు విద్యాదేవీ భండారీ ఆమోద ముద్ర వేశారు. ఈ ప‌రిణామంతో బార‌త్ ఉలిక్కి ప‌డింది. మోడీ స‌ర్కారుకు చెమ‌ట‌లు ప‌ట్టాయి. భార‌త భూభాగంపై జ‌రుగుతున్న ఇలాంటి దాడుల‌ను నిలువ‌రించ‌డంలో మోడీ పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న ప్ర‌బ‌లుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోప‌క్క‌, అత్యంత కీల‌క‌మైన క‌రోనా వైర‌స్ దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో మోడీ ప్ర‌భుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version