ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీఎం 2.5 పై సగటున 331 పాయింట్లుగా గాలి నాణ్యత ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కాలుష్య ప్రభావంతో వారం రోజుల పాటు ఫిజికల్ స్కూల్స్ మూసివేశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ను అమలు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించాలని ఢిల్లీ ప్రభుత్వం కోరింది.
వర్క్ ఫ్రమ్ హోం కారణంగా రోడ్లపై వాహనాలు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే 17వ తేదీ వరకు భవన నిర్మాణ పనులను ఢిల్లీ ప్రభుత్వం నిలిపివేసింది. వృద్ధులు,చిన్నారులు,ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రజలు టపకాయలు కాల్చడం,ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను కాల్చడం తో భారీగా వాయు కాలుష్యం పెరిగిపోయింది. కళ్ళ మంటలు, గొంతు నొప్పి తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో పెరిగిన దుమ్ము ధూళి,కాలుష్య కారకాల శాతంతో రోడ్లపై విజబులిటీ సైతం తగ్గిపోయింది.