అవినీతి చిట్టా తీస్తాం.. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాము : బండి సంజయ్

-

అవినీతి చిట్టా తీస్తాం.. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని.. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తామనీ స్పష్టం చేశారు బండి సంజయ్. రైతుల పక్షాన పోరాడతామని.. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయి, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటి…? అని నిలదీశారు.

దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆరెస్ భయపడుతోందని.. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బాధ్యత యుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారు. పోలీసుల బందోబస్తు, వారి సహకారంతో దాడులు చేస్తున్నారని.. మాపై దాడికి స్కెచ్ వేసినప్పుడే నిన్నటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. నిన్న దాడిలో మిర్యాలగూడ ఏబీఎన్ రిపోర్టర్ మనోజ్ కు గాయాలయ్యాయి, ఇది చాలా దారుణమన్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే తలలు నరుకుతావా.. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. మా పై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా ? అని నిలదీశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version