Dell New Inspiron 15 5509 Review..11th జనరేషన్ ప్రాసెసర్‌ తో బెస్ట్ ఫీచర్స్

-

వర్క ఫ్రమ్ హోమ్ వల్ల చాలామంది ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు ల్యాప్ టాప్స్ ఇస్తున్నప్పటికీ.. మరికొన్ని మన దగ్గర ఉంటేనే ఉద్యోగం ఇస్తామంటున్నాయి..దాంతో తప్పక ల్యాప్ టాప్ తీసుకోవాల్సి వస్తుంది. హడావిడిగా కొన్నా.. మంచిది తీసుకోవాలి కదా. ఫోన్లలా ల్యాప్ టాప్ ను పదే పదే మార్చం. తీసుకుంటే ఒకేసారి కాస్త హై లెవల్ ఉన్నదే తీసుకోవాలి. అలాంటి వారికి.. కొత్తగా వచ్చిన Dell New Inspiron 15 5509 మంచి ఎంపికే.. ఈరోజు మనం దీని రివ్యూ చూద్దాం. నచ్చితే తీసుకోవచ్చు కదా..!

డెల్ వోస్ట్రో సిరీస్ లాగానే ఇన్‌స్పిరాన్ సిరీస్ కూడా జనాదరణ పొందింది. ఇప్పుడు XPS సిరీస్‌కి దగ్గరగా వచ్చే కొన్ని మంచి నోట్‌బుక్‌లను అందిస్తుంది.డెల్ ఇన్‌స్పిరాన్ 15 స్పోర్ట్స్ స్లీక్ డిజైన్‌తో వచ్చింది. ప్రీమియం నోట్‌బుక్‌లకు మాత్రమే ఇప్పటి వరకూ ఇలాంటి డిజైన్ తో ఉంది. డైమండ్ కట్ ఎడ్జెస్ ఉంటాయి. లగ్జరీ టచ్ స్టైల్ ఉండటం ఈ ల్యాప్ ప్రత్యేకత. చూడ్డానికి డీసెంట్ లుక్ తో మిమ్మల్ని ఆకర్షింపచేస్తుంది. ఇండియాలో డెల్ ఇన్‌స్పిరాన్ 15 రూ. 47 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రాసెసస్, వేరియంట్‌ను బట్టి రేటు మారుతుంది. డెల్ ఇన్‌స్పిరాన్ సిరీస్‌ను 2015లో లాంచ్ చేశారు. మంచి ఆదరణ లభించడంతో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తున్నారు.

Dell New Inspiron 15 5509 బేసిక్ ఇన్ఫర్మేషన్ :

మోడల్ : న్యూ ఇన్‌స్పిరాన్ 15 5509
గ్లోబల్ లాంచ్ డేట్ : 13-01-2021
ఆపరేటింగ్ సిస్టమ్ : Windows 10 Home

డిస్‌ప్లే

రిజల్యూషన్ : 1920 x 1080
డిస్‌ప్లే సైజ్ ( ఇంచ్‌ల్లో ) : 15.6
డిస్‌ప్లే టెక్నాలజీ : UHD

సౌండ్

స్పీకర్స్ : Stereo speakers with Waves
సౌండ్ టెక్నాలజీ : MaxxAudio® Pro ALC3204

కనెక్టివిటి

వైర్‌లెస్ కనెక్టివిటి : Yes

మెమరీ

ర్యామ్ : 8 జీబీ
ర్యామ్ టైప్ : DDR4
ర్యామ్ స్పీడ్ (In Mhz) : 3200

ఫిజికల్ స్పెసిఫికేషన్

ల్యాప్ ట్యాప్ బరువు : 1.714 కేజీలు
డైమన్షన్ (In Mm) : 14.15 x 356.1 x 234.5

ప్రాసెసర్

ప్రాసెసస్ మోడల్ నేమ్ : 11th Gen Intel® Core™ i3-1115G4
క్లాక్ స్పీడ్ : 4.1 GHz
గ్రాఫిక్స్ స్పీడ్ : Intel® UHD
క్యాచే L3 : 6MB

స్టోరేజ్

స్టోరేజ్ డ్రైవ్ టైప్ : SSD
స్టోరేజీ డ్రైవ్ కెపాసిటీ : 512 GB

పవర్

బ్యాటరీ టైప్ : Integrated
పవర్ స్ప్లై : 53WHr

Read more RELATED
Recommended to you

Exit mobile version