ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన తెలంగాణ సచివాలయ భవనం ఇక కనమరుగుకానుంది. త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభంకానుంది.. ఆ దిశగా సీఎం కేసీఆర్ సర్కార్ అడగులు వేస్తోంది. హైకోర్టు తీర్పుతో తెలంగాణ సచివాలయ కొత్త భవన నిర్మాణానికి మార్గం సుగమమైన నేపథ్యంలో పాత భవనం కూల్చివేత పనుల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజాము నుంచే భారీ యంత్రాలతో భవనం కూల్చివేత పనులు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఆ వైపుగా వాహనాలు రాకుండా రోడ్లను మూసివేశారు. పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి అదే స్థానంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల చివరికల్లా సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి… శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్ సర్కార్ భావిస్తుంది.