గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుంది ప్రభుత్వం అమలు జరుపుతున్న ఈ నాలుగు పధకాలకు 45 వేల కోట్ల ఖర్చు అవుతోంది. కెసిఆర్ పది సంవత్సరాల రాష్ట్రంలోని నిరుపేదలను పట్టించుకోలేదు. కనీసం పదేళ్ల లో రేషన్ కార్డ్ కూడా ఇవ్వలేదు. ఎక్స్ పోస్ట్ లు పెడుతున్న నాయకుడికి స్పష్టంగా చెబుతున్న. మీరు పదేళ్ల లో ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే నేడు మేము రేషన్ కార్డులు ఇచ్చే అవసరమే లేదు.
పదేళ్ల మీ పాలనలో గడీలలో కూర్చుని లెక్కలు రాసి దోపిడీ చేశారు. మేము గ్రామ గ్రామాన సభలు నిర్వహించి ప్రజల మధ్యలో ప్రజల ఆమోదం తో పధకాలు కేటాయిస్తున్నాము. బిఆర్ఎస్ నాయకులు మూడు రోజులు గా రాష్టంలో పేట్రేగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరిపే. సంక్షేమ పథకాల అమలుపై దుష్ప్రచారం చేసి అల్లరి చూస్తున్నారు . ప్రజలు గమనించండి అటువంటి వ్యక్తులకు బుద్ది చెప్పండి.. మీకు ఎవరికీ అన్యాయం జరగదు.. ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయానికి అనువుగా ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇస్తున్నాము అని భట్టి పేర్కొన్నారు.