అంతర్జాతీయ శ్రామికుల దినోత్సవం (మే డే) సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి శ్రామికులతో పవన్ కల్యాణ్ ఆత్మీయ కలయిక కార్యక్రామాన్ని నిర్వహించారు.
ముందుగా ప్రపంచ శ్రామిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మిక లోకానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను చూస్తున్నందున తన శాఖ పరిధిలోని గ్రామీణ ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు.ఈ సంందర్భంగా శ్రామికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రామికుల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.