బీఆర్ఎస్ సర్కారు మీద జయేశ్ రంజన్ సంచలన ఆరోపణలు

-

గతంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జయేశ్ రంజన్.. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారులో సీఎంవో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. అయితే, జయేశ్ రంజన్ గతంలో మాజీమంత్రి కేటీఆర్‌కు చాలా నమ్మిన వ్యక్తిగా ఉన్నారు. పదేళ్లు అదే శాఖలో ఉన్నారు.

తాజాగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజానికి గతంలో కంటే ఇప్పుడే తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నచ్చి అనేక పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు.ఏడాది కాలంలోనే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ముమెంటం చాలా బాగుంది. నేను కూడా చాలా మంది విదేశీ ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వ పాలసీలను వివరించాను’ అని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news