నన్ను అరెస్ట్ చేసినప్పటికీ …. పార్టీ మరింత ఐక్యమైంది : అరవింద్ కేజ్రీవాల్

-

నన్ను అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పటికీ కూడా పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి కట్టుగా ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.నా అరెస్ట్ తర్వాత, ఆప్ మరింత ఐక్యమైంది అని తెలిపారు. ప్రజలకు మందులు అందడంలో ఇబ్బందులు రాకూడదని, ఉచిత కరెంటు, నీళ్లు ఆపకూడదని నేను ఆందోళన చెందాను కాని మీరందరూ చాలా బాగా పనిచేశారు అని ప్రశంసల వర్షం కురిపించారు.

బీజేపీ చేసిన ఏ కుట్రను సఫలం కానివ్వలేదని తన పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేజ్రీవాల్ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. నన్ను అరెస్టు చేసి, పార్టీని విచ్ఛిన్నం చేయాలని, ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని, ఆపై పంజాబ్‌లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది అని మండిపడ్డారు. అరెస్టు చేసిన తర్వాత, వారి ప్లాన్ విఫలమైంది, మీరందరూ పార్టీని విచ్ఛిన్నం చేయనివ్వలేదు, నా అరెస్ట్ తర్వాత పార్టీ మరింత బలపడిందని ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయినా కేజ్రీవాల్ శుక్రవారం సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news