మంచి రాబడి పొందాలని చాలా మంది పోస్టాఫీస్ లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. ఇక్కడ డబ్బులు దాచుకుంటే ఏ రిస్క్ ఉండదు. అయితే పోస్టాఫీస్‌లో చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆ పధకాల గురించి పూర్తి వివరాలలోకి వెళితే..
రికరింగ్ డిపాజిట్: రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చక్కటి బెనిఫిట్స్ ని ఇస్తుంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ వస్తోంది. దీని మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు. దీనిలో ప్రతీ నెలా డబ్బులు కట్టాలి.
టైమ్ డిపాజిట్: టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటుంది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాల పరిమితితో ఈ స్కీమ్ లో ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాలి. వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 6.7 శాతం వస్తుంది.
మంత్లీ ఇన్కమ్ స్కీమ్: ఇక మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎలా పని చేస్తుంది అనేది చూస్తే.. ఈ పథకంపై 6.6 శాతం వడ్డీ పొందొచ్చు. గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. మెచ్యూరిటీ కాలం వచ్చేసి ఐదేళ్లు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. 7.1 శాతం వడ్డీ వస్తుంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్: ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ వస్తుంది. రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు.
సుకన్య సమృద్ధి యోజన: ఈ పథకం పై 7.6 శాతం వడ్డీ వస్తుంది. ఇందులో కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. 15 ఏళ్ల వరకు డబ్బులు పెట్టాలి. మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు.
కిసాన్ వికాస్ పత్ర: దీనిలో 6.8 శాతం వడ్డీ వస్తుంది. 124 నెలల్లో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్: ఎన్ఎస్సీ స్కీమ్‌పై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఎంతైనా పెట్టచ్చు.