రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే ఆయుర్వేద నిపుణులు చెప్తున్న ఈ అద్భుతమైన పద్ధతుల్ని పాటించండి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా అవసరమైన పోషక పదార్థాలు తీసుకోవాలి. విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
ఇదిలా ఉంటే ఒళ్ళు నొప్పులు ఉండి వాసన తెలియక పోయినా, రుచి తెలియకపోయినా సాధారణంగా ఆకలి వేయదు. అయితే ఆరోగ్యం బాగా ఉండి.. రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఈ పద్ధతిని పాటించండి.
మొదటి రెసిపీ:
కావలసిన పదార్థాలు:
50 గ్రాములు బియ్యం
800 మిల్లీ లీటర్లు నీళ్లు
ఉప్పు రుచికి సరిపడా
ఒక టీస్పూన్ జీలకర్ర పొడి
రెండు పించెస్ అల్లం పొడి
తయారు చేసుకునే పద్ధతి:
ముందుగా కుక్కర్ తీసుకుని వీటన్నిటిని వేసి ఉడికించండి. బాగా ఉడికాక ఆ మిశ్రమాన్ని సర్వ్ చేసుకుని తినండి అంతే. ఎంతో ఈజీగా ఈ రెసిపీని తయారు చేసేయచ్చు.
రెండవ రెసిపీ:
కావలసిన పదార్థాలు:
ఒక కప్పు వేడి నీళ్లు
అర చెక్క కమల రసం
సాల్ట్ రుచికి సరిపడా
మిరియాలు
తయారు చేసుకునే పద్ధతి:
ఇక్కడ తీసుకున్న పదార్థాలన్నింటిని కూడా బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోండి. ఇలా ఎంతో ఈజీగా దీనిని కూడా మనం చేసేసుకొచ్చు. ఇలా చేయడం వల్ల త్వరగా రికవరీ కూడా అవ్వచ్చు. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.