Devara : ‘దేవర’ షార్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది చూశారా.. సముద్రంలో రక్త కెరటాలు..

-

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర .అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 8న ఈ చిత్రం గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఇంతకుముందు డేట్ ని చెప్పారు గాని కరెక్ట్ టైం చెప్పలేదు. తాజాగా ఆ టైంని వెల్లడి చేస్తూ ఒక నాలుగు సెకన్ల షార్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఆ గ్లింప్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఆయుధాన్ని పట్టుకొని సముద్రంలో రక్తాన్ని కడుగుతూ కనిపిస్తున్నాడు. ఇక ఇది చూసిన ప్రేక్షకులకి జనవరి 8న రాబోయే గ్లింప్స్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

కాగా ఈ గ్లింప్స్ ని జనవరి 8న సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవి చందర్ ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు. ఈ గ్లింప్స్ కి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెడీ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version