ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ట్రీట్.. దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది..!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతీ పది మందిలో నలుగురు, ఐదుగురు దాదాపు గా దేవర మూవీ గురించే చర్చించుకుంటున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అభిమానులను దేవర మరో సాలిడ్ ట్రీట్ ఇచ్చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు అదుర్స్ అనిపిస్తున్నాయి. ప్లాష్ బ్యాక్ సీన్స్ కట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చివరి అరగంట సినిమాకు హైలెట్. ఆ సీన్స్ కొన్ని ఈ ట్రైలర్ లో చూపించారు దర్శకుడు కొరటాల శివ. దీంతో ఈ మూవీ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. కేవలం ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా  ఈ చిత్రానికి మిడ్ నైట్ షోలకు ప్రభుత్వాలు ఫర్మిషన్లు ఇచ్చారు. దీంతో దేవర మేనియాతో అభిమానులు ఊగిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version