దేవర మూవీ విడుదల కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది.మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి హైప్ కొనసాగుతూ వస్తోంది.ఎప్పుడు ఎలాంటి అప్‌డేట్ వస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే విడుదల ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే,రెండో ట్రైలర్ కూడా ఆదివారం ఉదయం రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనుకోకుండా ఆ నిర్ణయాన్ని మేకర్స్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఉదయం 11.07 గంటలకు విడుదల కావాల్సిన సెకండ్ ట్రైలర్ వాయిదా పడింది. ఆయుధ పూజ సాంగ్ కూడా వాయిదా పడుతూనే ఉంది. ముందుగా ఒక డేట్ చెప్పడం, తర్వాత విడుదల చేయడం లేదని చెప్పడం మేకర్స్‌కు అలవాటుగా మారిందని ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.