చూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదు:జగన్

-

ఆంధ్ర ప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం అభివృద్ధి కాదా? అని ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ‘4 పోర్టులు కడుతున్నాం. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్ పనులను పరుగులు పెట్టిస్తున్నాం. EODBలో ఏపీని నం.1 స్థానంలో ఉంచాం. గ్రామాల్లో సచివాలయాలు, RBK, విలేజ్ క్లినిక్లు పెట్టాం. ఇదంతా అభివృద్ధి కాదా? చూడాలని లేనప్పుడు ఈ అభివృద్ధి కనిపించదు’ అని ఎద్దేవా చేశారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వరన్న ప్రచారంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చారు. ‘రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తాం. జిరాక్స్ ఇస్తారనేది తప్పుడు ప్రచారం. 9 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వాళ్లంతా ఒరిజినల్ సర్టిఫికెట్లే తీసుకున్నారు. ఏదో జరిగిపోతోందని చంద్రబాబు దిగజారి ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు మోసపూరిత మనిషి’ అని ఫైరయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version