చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి కేసులో పురోగతి లేదు : దేవినేని ఉమ

-

 

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు. నందిగామ ఘటనపై సాక్షి పత్రిక, ఛానల్‌ తప్పుడు కథనాలు ప్రచురించిందని విమర్శించారు దేవినేని ఉమ . గురువారం ఆయన నందిగామలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై ఆరు టీమ్‌లు ఏర్పాటు చేశామని, నిందితులను పట్టుకుంటామని పోలీస్ కమిషనరే చెప్పారన్నారు దేవినేని ఉమ. ఇంతవరకు పురోగతి లేదని ఆరోపించారు దేవినేని ఉమ. జడ్‌ ప్లస్‌ కేటగిరి ఉన్న చంద్రబాబు రోడ్‌షో సందర్భంగా కరెంట్ పోవడమేంటని ప్రశ్నించారు దేవినేని ఉమ.

బహిరంగ సభ జరిగే సమయంలో సంచులు పట్టుకుని కొందరు నిలబడ్డారని, ఆ ఫొటోను విడుదల చేశామన్నారు దేవినేని ఉమ. చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ మధుకి గాయం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చూశారని దేవినేని ఉమ అన్నారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. విధ్వంసం, అబద్ధాలు చెప్పడం వైసీపీ ప్రభుత్వ విధానమని విమర్శించారు దేవినేని ఉమ. నిర్మించడం, నిజాలు చెప్పడం తెలుగుదేశం పార్టీ విధానమని వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version