ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ముగిసిన మొదటిరోజు ముగ్గురు నిందితుల కస్టడీ

-

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సిట్‌ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఈ కేసులో మొదటి రోజు ముగ్గురు నిందితుల కస్టడీ ముగిసింది. ఇవాళ పోలీసులు దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. ముగ్గురు నిందితులను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నించారు. మొదటి రోజు కస్టడీ ముగిసిన తర్వాత రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుండి నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు ఉదయం మరోసారి విచారించనున్నారు. అంతకుముందు.. మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితులను ఇవాళ ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుండి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కస్టడీలో భాగంగా రామచంద్ర భారతి, నంద కుమార్, సింహాయాజీలను మొదటిరోజు విచారించారు.

మరోవైపు సిట్ బృందం సైతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. అంతకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీని పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు ప్రయత్నించారని, కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారని పోలీసుల తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version