ఉదయం నుండి హైడ్రామా.. ఎట్టకేలకి దేవినేని ఉమా విడుదల !

-

కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా పోలీసుల అదుపులో నుంచి విడుదలయ్యారు/ కొద్దిసేపటి క్రితమే ఆయనను పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు విడుదల చేశారు. ఈరోజు రోజు ఉదయం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేయడానికి దేవినేని ఉమా ప్రయత్నం చేశారు. అయితే అందుకు పోటీగా వైసిపి కార్యకర్తలు కూడా ఆ స్థలానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఉమా దీక్షకు అనుమతి నిరాకరించారు.

అయినా సరే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరకు వచ్చి ఎన్టీఆర్ విగ్రహం చేరుకున్న దేవినేని ఉమా ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఉమాను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకు వెళుతున్నారు అనే విషయం తెలియకుండా ఉదయం నుంచి పోలీసులు తిప్పుతూనే ఉన్నారు. చివరికి కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అన్న సంగతి తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఆ స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో పోలీసులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news